శరత్ బాబు నా భర్తే కాదంటూ సంచల వ్యాఖ్యలు చేసిన స్నేహ..!!

టాలీవుడ్ ,కోలీవుడ్ లో విలక్షణమైన నటుడుగా పేరుపొందిన శరత్ బాబు ఈ ఏడాది పలు అనారోగ్య సమస్యల వల్ల మరణించిన సంగతి తెలిసిందే.. శరత్ బాబు సినీ విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే..ఈయన వ్యక్తిగత విషయంలో ఎన్నో రూమర్స్ సైతం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నటి రమా ప్రభను ప్రేమించి మరి వివాహం చేసుకున్న శరత్ బాబు కొన్ని విభేదాల వల్ల విడిపోవడం జరిగింది. అంతేకాకుండా రమా ప్రభ ఆస్తి మొత్తం కాజేశారని వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి.

ఆ తర్వాత స్నేహా నంబియార్ ను రెండవ పెళ్లి చేసుకున్నారని ఆమెతో కూడా విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసారని వార్తలు వినిపించాయి. రెండో పెళ్లి విడాకులు అనంతరం ఆయన సింగిల్గానే ఉంటున్నట్లు సమాచారం. అయితే స్నేహానంబియార్ అనగానే ప్రతి ఒక్కరికి కోలీవుడ్ నటి అని అందరూ అనుకుంటూ ఉంటారు.. అయితే ఈమెనే వివాహం చేసుకున్నారని చాలామంది అనుకున్నారట. కానీ స్నేహ నంబియార్ అంటే తాను కాదని తాజాగా నటి స్నేహనంబియార్ తెలియజేయడం జరిగింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శరత్ బాబు తన భర్త కాదని తెలియజేసింది. తన పేరు స్నేహ నేను శరత్ బాబు రెండో భార్యను కాదు ఆయన రెండో భార్య స్నేహ నంబియార్ అంటే తన ఫోటోలను ఉపయోగించుకున్నారని ఆమె నేను కాదు అంటూ తెలియజేసింది. శరత్ బాబు రెండవ భార్య స్నేహనంబియార్ తనకంటే పెద్దదని. తనని కూడా నంబియార్ కూతురు అంటూ ప్రచారం చేస్తున్నారు అందులో నిజం లేదు.. మాది కన్నూరు అందులో నంబియార్ వర్గానికి చెందిన అమ్మాయి కావడం చేత తన పేరు పక్కన నంబియార్ ని జత చేసుకున్నాను అంతేతప్ప శరత్ బాబు రెండవ భార్యని కాదంటూ తెలియజేసింది.