ప్రస్తుత ఏపీ పరిస్థితులపై స్కంద పొలిటికల్ పంచ్ లు.. వైరల్ అవుతున్న డైలాగ్స్.. !

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి శీను డైరెక్షన్లో రూపొందిన మూవీ స్కంద. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి డైరెక్షన్లో ఈ సినిమా రూపొందింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అభిమానులో ఇప్పటికే మ్చి అంచనాలు ఉన్నాయి. బోయపాటి కొన్ని సినిమాల్లో పొలిటికల్ పంచులు కూడా ఓ రేంజ్ లో వాడతాడు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే బోయపాటి ముందు సినిమాల్లో కూడా పొలిటికల్ డైలాగ్స్ బాగా పెలాయి. థియేటర్‌లో విజిల్స్ వేయించిన సందర్భంగా బోయపాటి పొలిటికల్ డైలాగ్స్ తో ఓ రేంజ్ లో అదరగొట్టాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులపై బోయపాటి తనదైన స్టైల్ లో సెటైరికల్ గా డైలాగ్స్ రాసాడట. ట్రైలర్ ఓపెనింగ్ లోనే జైల్లో ఉన్న శ్రీకాంత్‌ను చూపిస్తూ ఇంకో పక్క కోర్ట్ హాల్‌ను చూపిస్తూ పరిస్థితులకు తలవంచి మీరు తప్పు చేశారని ఒప్పుకోవచ్చు ఆ చట్టం ఒప్పుకోవచ్చు ఆ ధర్మం ఒప్పుకోవచ్చు కానీ ఆ దైవం ఒప్పుకోదు సార్ అంటూ వాయిస్ ఓవర్ ఇచ్చిన తీరు ప్రస్తుత ఏపీ రాజకీయాలకు అర్థం పట్టినట్టు ఉందంటున్నారు. ఇది ఒకటే కాకుండా మేము కోడిని, పొట్టేలునే కాదు మాకు ఎదురొస్తే దేనినైనా పచ్చడి పెడతాం. జాడీ ఎక్కిస్తాం రింగులోకి దిగితే రీ సౌండ్‌ రావాలి. చూసుకుందాం బరాబర్ చూసుకుందాం అంటూ డైలాగ్స్ ఇవ్వడం పొలిటికల్ పంచ్ లానే ఉన్నాయని భావిస్తున్నారు.

ఇక‌ ఓ రాజకీయ నేతను ఉద్దేశించి కావాలనే బోయపాటి ఈ డైలాగ్ పెట్టాడని టాక్ నడుస్తుంది. ఈ రెండు సన్నివేశాలతో స్కందాలో ఓ పక్కన రాజకీయపరంగాను, మరో పక్క సినిమా పరంగాను హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు బజ్‌ లేని ఈ సినిమాకు ఈ ఒక్క డైలాగ్ మంచి హైప్‌ని తెచ్చి పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ డైలాగ్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ట్రైలర్ లో ఏ డైలాగు ఒకటే ఉంది. సినిమాలో ఇంతకుమించి డైలాగ్స్ ఉంటాయని మేకర్స్ హిట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా రిలీజై ఎన్ని గొడవలు సృష్టిస్తుందో చూడాలి.