టీడీపీ-జనసేన మధ్య చిచ్చు..ఆ మీడియా టార్గెట్.!

టీడీపీ-జనసేన పొత్తు ఎంతవరకు వైసీపీని దెబ్బకొడుతుందో తెలియదు గాని..పైకి పొత్తు వల్ల తమకు నష్టం లేదని వైసీపీ నేతలు అంటున్నారు..కానీ లోలోపల మాత్రం ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి దాదాపు చాలా సీట్లలో వైసీపీకి లాభం జరిగింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది. అందులో 50 సీట్లు కేవలం ఓట్ల చీలిక వల్లే గెలిచిందని చెప్పవచ్చు.

అందుకే ఈ సారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని టి‌డి‌పి-జనసేన ఫిక్స్ అయ్యాయి. ఆ దిశగానే ఇప్పుడు రెండు పార్టీలు వెళుతున్నాయి. అయితే పొత్తు ఉన్నా తమకు నష్టం లేదని వైసీపీ అంటుంది. కానీ పరోక్షంగా మాత్రం పొత్తు వల్ల నష్టం తప్పదని భావిస్తున్నారు. ఇదే సమయంలో పొత్తుని దెబ్బతీయడానికి రకరకాల ఎత్తులతో వైసీపీ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య విభేదాలు పెంచడం, సీట్ల విషయంలో చిచ్చు పెట్టడం, అటు కమ్మ-కాపు కులాల మధ్య కుంపటి రాజేసేలా వైసీపీ వెళుతుందని విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా జనసేన నాగబాబు..టి‌డి‌పిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ..వైసీపీ సొంత మీడియాలో కథనం వచ్చింది. టి‌డి‌పి పొత్తులో జనసేన ఎక్కువ సీట్లు గెలితే పవన్ సి‌ఎం అవుతారని, అప్పుడు జనసేన కింద టి‌డి‌పి పనిచేయాలని నాగబాబు అన్నట్లు కథనం వచ్చింది. దీనిపై నాగబాబు కూడా తీవ్రంగానే స్పందించారు.

“జనసేన కింద టీడీపీ పని చేస్తుందని మీ పేపర్లో రాస్తారా?. మీకు సమాధానం చెప్పటం కూడా వృధా అని నాగబాబు ఆ పత్రిక విలేకరితో అన్న్తలు తెలిసింది. జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతిలో ఎవరు పోటీ చేయాలో ఆ పత్రిక వాళ్లే నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మొత్తానికి టి‌డి‌పి-జనసేన పొత్తుని దెబ్బతీయడానికి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.