తేనెతో వీటిని కలిపి రాస్తే మొఖంపై మచ్చలు, మొటిమలు మాయం..

ఈరోజుల్లో చిన్న నుంచి పెద్దవాళ్ల వరకు ఆడ, మగా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును పోస్తున్నారు. మన ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి సౌందర్య పోషణను మన సొంతం చేసుకోవచ్చు. ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా చేసుకోవచ్చు. మొటిమల నుంచి రిలీఫ్‌ పొందవచ్చు.

ఈ చిట్కాల కోసం రోజ్‌వాటర్, తేనే కేవలం రెండే రెండు ఇంగ్రిడియంట్స్ సరిపోతాయి. ఒక బౌల్లో ఒక స్పూన్ రోజ్ వాటర్ అర స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి ఐదు నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం వస్తుంది. తేనెలో ఉన్న పోషకాలు చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది.

రోజ్ వాటర్ లో ఉన్న లక్షణాలు చర్మాన్ని రిపేర్ చేసి స్కిన్ గ్లో గా అయ్యేలా చేస్తుంది. ఇక ఇది ఆర్గానిక్ తేనె అయితే ఇంకా మంచిది. అలాగే రోజ్‌వాటర్ మార్కెట్ లో దొరుకుతుంది. లేదంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ చిట్కా మొటిమలు మచ్చలను అన్నిటిని తొలగించి ముఖం గ్లోగా మార‌టానికి స‌హాయ‌ప‌డుతుంది.