కమలంపైనే అనుమానాలు..టీడీపీ ప్లాన్ రివర్స్.!

చంద్రబాబుని కక్షపూరితంగా…ఎలాంటి ఆధారాలు లేకుండా..కేవలం అధికార బలంతో జగన్ అరెస్ట్ చేయించారని తమ్ముళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కేవలం కక్షతోనే బాబుని జగన్ అరెస్ట్ చేయించారని ఫిక్స్ అయ్యారు. అందుకే వైసీపీపై తమ్ముళ్ళు పోరాటం చేస్తున్నారు. బాబు అరెస్టుకు నిరసనలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో బాబుని అరెస్ట్ చేయించింది జగన్ అయితే..దీని వెనుక ఉన్నది బి‌జే‌పి పెద్దలు అని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు.

అనుమానించడం ఏముంది..డైరక్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. బి‌జే‌పి పెద్దల డైరక్షన్ లోనే జగన్ ఇదంతా చేశారని అంటున్నారు. పైగా బి‌జే‌పినే ఇదంతా చేయించిందని జాతీయ స్థాయిలో బి‌జే‌పి వ్యతిరేక నేతలు కామెంట్స్ చేస్తున్నారు. మమతా బెనర్జీ గాని, అఖిలేశ్ యాదవ్ ఇలా పలువురు నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు అదే తరహాలో మాట్లాడుతున్నారు. బి‌జే‌పి ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని చెబుతున్నారు. మొత్తానికి బాబు అరెస్ట్ వెనుక ఉన్నది బి‌జే‌పి అని అనుమానిస్తున్నారు.

కానీ దీనిపై బి‌జే‌పి నేతలు స్పందించడం లేదు. బి‌జే‌పి పెద్దలు ఒక్కరూ కూడా బాబు అరెస్ట్ పై కామెంట్లు చేయలేదు. బాబుతో బి‌జే‌పి పెద్దలకు పరిచయాలు ఎప్పటినుంచో ఉన్నాయి. పోనీ తప్పు చేస్తే శిక్ష పడుతుందని, చేయకపోతే బయటకొస్తారనే కామెంట్లు కూడా రావడం లేదు. బాబు అరెస్ట్ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంటే..ఇతర నేతలంతా ఏదో రకంగా స్పందిస్తున్నారు..గాని బి‌జే‌పి పెద్దలు ఒక్కరూ కూడా మాట్లాడటం లేదు.

దీని బట్టి చూస్తే బాబు అరెస్ట్ వెనుక ఖచ్చితంగా బి‌జే‌పి పెద్దలు ఉన్నారని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు. రేపు ఎన్నికల సమయంలో బి‌జే‌పి పొత్తు అంశం వస్తే..తమ్ముళ్ళు ఏ మాత్రం ఒప్పుకునేలా ఉన్నారు.