నేను ఎలా ఉంటే నీకే.. నన్ను ఏమైనా పెళ్లి చేసుకుంటావా..? రష్మీ కామెంట్స్ వైరల్..

స్టార్ యాంకర్ రష్మీ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులాటి సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత ప‌లు సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. బుల్లితెర, వెండితెరపై కూడా తన సత్తా చాటుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందంతో, డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన అందాల ప్రదర్శనలో ఒక అడుగు ముందే ఉంటుంది.

ఒక్కొక్కసారి ఈమె ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ఇక విషయానికొస్తే తమిళనాడు పొలిటీషియ‌న్ ఉధ‌య‌నిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన కామెంట్స్ కాంట్రవర్షల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై రష్మీ గౌతం కూడా స్పందించింది. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు నువ్వు.. నీ దుస్తులు ఏంటి..? నువ్వు సినిమాల్లో ఎలా కనిపిస్తున్నావు..? అని ఓ నెటిజ‌న్ ప్రశ్నించాడు. దానికి స్పందించిన రష్మీ అది వృత్తిలో భాగం. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాలని రిప్లై ఇచ్చింది.

దానికి మ‌రో నెటిజ‌న్ నువ్వు ఇప్పుడు ఇలా డ్రెస్ వేసుకుంటావు సరే.. కొన్నాళ్లకు నీ కొడుకు, కూతురు ఈ ఫోటోలు చూసి బాధపడితే ఏం చేస్తావ్..? వారి ఫ్రెండ్స్ ఏంటి మీ మమ్మీ ఇలా డ్రెస్ చేసుకుంటుంది అని ట్రోల్‌ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం సమాధానం చెప్తావ్..? అని అడిగాడు. దానికి స్పందించిన రష్మీ అది నాకు, నా పిల్లలకు సంబంధించిన విషయం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం లేదుగా.. నీకేంటి సమస్య..? అంటూ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం రష్మి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.