పవన్ కన్ఫ్యూజన్ పాలిటిక్స్..తేడా కొడుతుందా?

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలు పూర్తిగా క్లారిటీ ఉన్నట్లు కనబడటం లేదు. ఆయన బి‌జే‌పితో పొత్తులో ఉన్నారు..అదే సమయంలో ఎక్కువ టి‌డి‌పికి మద్ధతుగా నిలబడుతున్నారు. దీని బట్టి చూస్తుంటే ఆయన ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అయితే అరెస్ట్‌కు తెలుగు తమ్ముళ్ళు నిరసన తెలుపుతున్నారు. అంతకంటే ఎక్కువగా పవన్ సైతం నిరసన తెలిపారు. బాబుకు మద్ధతు ఇచ్చారు.

కానీ పవన్ పొత్తులో ఉన్న బి‌జే‌పి మాత్రం..బాబు అరెస్ట్ పై పెద్దగా నోరు మెదపడం లేదు. బాబుని అరెస్ట్ చేసిన విధానం తప్పు అని అంటున్నారు తప్ప..బాబు అరెస్ట్‌ని ఖండించడం లేదు. మొత్తానికి చూస్తుంటే ఇక్కడ రాజకీయం టోటల్ కన్ఫ్యూజన్ స్థాయిలో ఉంది. ఒకవేళ బి‌జే‌పి సైతం బాబుకు మద్ధతు తెలిపి..కేంద్ర పెద్దల సపోర్ట్ ఉంటే..అసలు బాబు అరెస్ట్ అయ్యే వారు కాదని విశ్లేషకులు అంటున్నారు. బి‌జే‌పి పెద్దలు..జగన్‌కు మద్ధతుగా ఉన్నారని, అందుకే ఇప్పుడు బాబు అరెస్ట్ అయ్యారని చెబుతున్నారు. పైగా బాబు అరెస్ట్ వెనుక జగన్ తో పాటు..కేంద్రం పెద్దలు ఉన్నారని తెలుగు తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు.

మరి ఇలాంటి పరిస్తితుల్లో పవన్ మాత్రం..బి‌జే‌పిని కాదని బాబుకు మద్ధతుగా నిలబడుతున్నారు. అయితే ఇందులో ఏదైనా వ్యూహం ఉందా? లేక బాబుకు అండగా ఉండాలని పవన్ అనుకుంటున్నారా? అనేది క్లారిటీ లేదు. పైగా ఎన్నికల సమయంలో పొత్తుల అంశం కూడా క్లారిటీ లేదు. బి‌జే‌పి-జనసేన కలిసి ఉన్నాయి..బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలిసే ఛాన్స్ లేదు. అప్పుడు బి‌జే‌పిని వదిలేసి..పవన్ టి‌డి‌పితో కలుస్తారా? అనేది చూడాలి. మొత్తానికి పవన్ రాజకీయంపై క్లారిటీ లేదు.