జావన్ మూవీ డాన్స్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న కీర్తి సురేష్..!!

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తెలుగు తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తమిళ డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ కూడా మంచి స్నేహితులు అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. దీంతో అట్లీతో కూడా కీర్తి సురేష్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. తాజాగా అట్లీ డైరెక్షన్ చేసిన జవాన్ సినిమా విడుదలై మంచి సక్సెస్ తో దూసుకుపోతోంది. దీంతో కీర్తి సురేష్ ఆల్ ది బెస్ట్ చెబుతూ లైటింగ్ సెట్లో ఒక స్పెషల్ సాంగ్ ని పోస్ట్ చేసింది.

Jawan 🔥 Chaleya / Hayyoda Song Dance By Keerthy Suresh & Atlee Wife Priya  😍| Srk | Nayanthara | Reel - YouTube

ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో తాజాగా ఈ సినిమాలోని ఒక పాటను డాన్స్ వేస్తూ ఒక వీడియోని సైతం షేర్ చేసినట్లుగా తెలుస్తోంది.ఈ మూవీలోని చెలియా సాంగ్ కి షారుక్ ఖాన్ వేసిన స్టెప్పులను అట్లీ వైఫ్ ప్రియా తో కలిసి కీర్తి సురేష్ అదరగొట్టేసింది. అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈ వీడియో చూసిన పలువురు నెటిజెన్లు సైతం ఫిదా అవుతూ డాన్స్ ని పొగిడేస్తున్నారు. జవాన్ సినిమా ఇప్పటివరకు 600 కోట్ల రూపాయల మార్కును అందుకున్నది.

షారుక్ ఈ సినిమాతో కూడా రూ.1000 కోట్ల కలెక్షన్ ని అందుకొని రికార్డ్ సైతం సృష్టిస్తున్నది. కీర్తి సురేష్ సినిమాలు విషయానికి వస్తే ఇటీవలే భోళా శంకర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం తెలుగులో మరో సినిమాలో కూడా నటించలేదు తమిళంలో నాలుగు సినిమాలలో నటిస్తోంది కీర్తి సురేష్.