కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల నటించిన మార్క్ అంటోని మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన విశాల్ డిటెక్టివ్ సినిమా డైరెక్టర్ మాస్కిన్‌పై కొన్ని సంచల కామెంట్స్ చేశాడు. విశాల్ మాట్లాడుతూ మస్కిన్ తో కలిసి మళ్ళీ పనిచేయడం జరగదని వివరించాడు. గతంలో విశాల్ డైరెక్టర్ మస్కిన్ తో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే. తప్పరివాలన్ తెలుగులో డిటెక్టివ్ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేశారు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఇక తప్పరివాలన్ 2 కూడా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతుందని న్యూస్ వైరల్ అయింది. అయితే సెట్స్ పై ఉన్న ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం దీనిపై స్పందించిన విశాల్ మాట్లాడుతూ తప్పరివాలన్ 2 సినిమా విషయంలో మస్కిన్ పెట్టిన ఇబ్బందులకు లండన్ రైల్వే స్టేషన్ లో కూర్చుని చాలా బాధపడ్డానని.. నేను ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేని.. నా స్థానంలో ఇంకెవరైనా పెద్ద వాళ్ళు ఉంటే హార్ట్ ఎటాక్ తో చచ్చిపోతారని నేను కాబట్టి మా స్కిన్ చేసిన పనులన్నీ నష్టాన్ని తట్టుకోగలిగాను అంటూ చెప్పుకోవచ్చాడు.
ఒకవేళ మస్కిన్‌తో కలిసి తప్పరివాలన్ 2 మళ్ళీ మొదలు పెట్టిన అది పూర్తవుదని.. అందుకే అతనితో సినిమాను ఆపేశానని.. వచ్చేయడాది నేనే తప్పరివాలన్ 2 రూపొందిస్తానని.. నేను ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. దీంతో విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలోనే కాక సోషల్ మీడియా అంతా వైరల్ గా మారాయి. దీనిపై మస్కిన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.