టార్గెట్ లోకేష్-పవన్..జగన్ హుకుం?

ప్రతిపక్షాలని పూర్తిగా దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారా? రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రధాన ప్రత్యర్ధి టి‌డి‌పిని దెబ్బతీయాలని చూస్తున్నారా? చంద్రబాబు అరెస్ట్ విధానం చూస్తే అవుననే చెప్పవచ్చని టి‌డి‌పి అనుకూల వర్గాలు అంటున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కక్షపూరితంగానే జగన్..బాబుని అరెస్ట్ చేయించారని టి‌డి‌పి శ్రేణులు మండిపడుతున్నాయి.

అయితే ఆ కేసులో ఇంకా నిజనిజాలు ఏంటి అనేది పూర్తిగా బయటకు రాలేదు. కానీ బాబుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ వ్యవహారం జగన్ లండన్ లో ఉండగానే జరిగిపోయింది. ఇక తాజాగా రాష్ట్రానికి వచ్చిన జగన్..అందుబాటులో కీలక నేతలతో పాటు.. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ సీతారామాంజనేయులు, అడిషినల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకరరెడ్డిలాంటి భేటీ అయ్యారని తెలిసిని. ఈ క్రమంలో చంద్రబాబును బోనులో నిలబెట్టి అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారంటూ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డిని జగన్‌ ప్రత్యేకంగా అభినందించారని టి‌డి‌పి అనుకూల మీడియాలో కథనం వచ్చింది.

ఇక రాజధాని భూములు, ఫైబర్‌నెట్‌, నీటిపారుదల రంగం, కార్మిక శాఖ తదితర విభాగాల్లో చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న నిధుల తరలింపు వ్యవహారాలపైనా దృష్టి సారించాలని అధికారులకు జగన్‌ స్పష్టం చేశారని టి‌డి‌పి అనుకూల మీడియా కథనం ఇచ్చింది. అటు రాజధాని భూముల వ్యవహారంలో =పవన్‌ కల్యాణ్‌ పాత్రనూ తెరపైకి తీసుకురావాలని చెప్పారట. అలాగే లోకేష్, టి‌డి‌పి ముఖ్య నేతలని వదలొద్దని సూచించారట.

ఇదంతా టి‌డి‌పి అనుకూల మీడియాలో వచ్చిన కథనం..మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో చెప్పలేం. ఒకవేళ ఇదేగాని నిజమైతే నెక్స్ట్ టార్గెట్ లోకేష్-పవన్ అని చెప్పవచ్చు.