ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 భాషల్లో రీమేక్ అయిన వెంకటేష్ మూవీ ఏంటో తెలుసా..?

సాధారణంగా ఓ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయిందంటే ఇతర భాషలో రీమేక్ కావడం కామన్. ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండు భాషల్లో రీమేక్ అయితే పెద్దగా ఆశ్చర్య పోవాల్సిందేముండదు. అయితే ఒక్క సినిమా మాత్రం ఏకంగా ఆరు భాషలో రీమేక్ అయింది. అది కూడా విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా కావడంతో ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా.. వెంకటేష్ దివంగత నటి సౌందర్య కలిసి నటించిన పవిత్ర బంధం.

ఈ సినిమా ఆ అరుదైన రికార్డును సృష్టించింది. వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. విదేశాల్లో పెరిగిన ఓ యువకుడికి ప్రేమా, లైఫ్ గొప్పతనం గురించి చెప్పిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది. కాంట్రాక్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన‌ ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. రిస్కీ సబ్జెక్ట్ అయినా ఈ సినిమాలో పాత్రలకు 100% న్యాయం చేశారు వెంకీ, సౌందర్య.

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బెంగాలీ, తమిళ్, బంగ్లాదేశ్, హిందీ, ఒరియా, కన్నడ భాషలో రీమేక్ అవ్వగా అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడం విశేషం. ఈ సినిమాకు బెస్ట్ మూవీగా నంది అవార్డు దక్కింది. సౌందర్య, ఎస్పీ బాలు కూడా ఈ సినిమా ద్వారా నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక‌ ప్రస్తుతం వెంకటేష్ సైంధ‌వ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.