‘కాపు’ శంఖారావం..పవన్‌కు రిస్క్.!

టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పొత్తు ఉంటుందని ప్రకటన కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. మరి పొత్తు ప్రకటించారు..కానీ జనసేన శ్రేణులు పూర్తిగా పొత్తుక్ రెడీగా ఉన్నాయా? అటు పవన్‌ని ఎక్కువగా అభిమానించే సొంత వర్గం కాపులు పొత్తుకు సుముఖంగా ఉన్నారా? అంటే చెప్పలేని పరిస్తితి.

పవన్‌కు మద్ధతుగా ఉండేవారు ఎక్కువగా..పవన్ సి‌ఎం అయితేనే ఏదైనా ఓకే చెబుతారు. కానీ పదవి అనేది తేలలేదు. పైగా టి‌డి‌పి..జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుందో చెప్పలేం. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ టి‌డి‌పిని భుజాన మోయాలనే ఫీలింగ్ లో కాపు వర్గాలు ఉన్నాయి. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తుకు పూర్తిగా మద్ధతు దక్కని పరిస్తితి. ఇప్పటికే కొందరు కాపు వర్గాలు తాము పొత్తుకు మద్ధతు ఇవ్వమని చెప్పేస్తున్నాయి. ఇదే క్రమంలో కాపు సంక్షేమ సేన సైతం ఆలోచనలో పడింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య మొన్నటివరకు పవన్‌కు మద్ధతు తెలిపారు. ఇప్పుడు ఆ విషయంలో డౌట్ లో ఉన్నారు.

ఈ క్రమంలో కాపు సంక్షేమ సేన శంఖారావం పూరించనుంది. ఈ నెల 24న పాలకొల్లులో సమావేశమై వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించినందున భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. మరి ఈ సమావేశంలో పవన్‌కు మద్ధతుగా ఉంటారా? లేదా వేరే నిర్ణయం ఏమైనా తీసుకుంటారేమో చూడాలి. మొత్తానికి చూస్తే పవన్‌కు పూర్తిగా కాపుల మద్ధతు దక్కుతున్నట్లు కనిపించడం లేదు.