సెన్సార్ బోర్డులకు కూడా లంచం ఇచ్చాను…హీరో విశాల్ సంచలన వీడియో..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో విశాల్.తెలుగు తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా హిందీ వర్షన్ కోసం అక్కడ సెన్సార్ బోర్డులకు లంచం ఇచ్చినట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయింది అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది విశాల్.. అలాగే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తుల పేర్లు అకౌంట్ నెంబర్లను సహా సోషల్ మీడియాలో బయట పెట్టడం జరిగింది.

Vishal alleges paying BRIBE of Rs 6.5 lacs for Mark Antony Hindi censor:  'Corruption being shown...' | PINKVILLA

ఈ విషయం తెలిసి పలువురు దర్శక నిర్మాతలు నటీనటులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లాలంటే కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అవినీతిని వెండితెర పైన చూపిస్తున్నారు కానీ నిజజీవితంలో జరుగుతూనే ఉందని దీనిని నేను జీర్ణించుకోలేకపోతున్నానంటూ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయం ముంబైలోని..CBFC ఆఫీసులో మరింత దారుణంగా జరుగుతోందంటూ తెలిపారు.

మార్కు ఆంటోని సినిమాని హిందీ వర్షన్ కోసం.. రూ.6.5 లక్షల రూపాయలు చెల్లించానని అందుకు సంబంధించిన లావాదేవులను రెండుసార్లు చేశానని ఒకటి స్క్రీనింగ్ కోసం మూడు లక్షలు అలాగే సర్టిఫికెట్ కోసం రూ.3.5 లక్షలు ఇచ్చినట్టుగా చూపించారు. తన కెరియర్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఎదురు కాలేదని ఈరోజు ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి సంబంధిత మధ్యవర్తికి ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప మరే మార్గం లేదు అని ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు. ఇలా చేయడం తన కోసం కాదని భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసమే అంటూ. ప్రస్తుతం విషయాలు చేసిన ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.