బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రవీనా టాండన్ కూడా ఒకరు. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే కొన్ని సినిమాలలో ఈమెకు అసౌకర్యంగా అనిపించినట్లు తెలియజేస్తోంది.. ఒక పురుష సహనటుడికి తన పెదాలను తగలడం వల్ల ఆమె చాలా అసౌకర్యంగా అనిపించిందట.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రవీనా టాండన్ తన సినిమాలలో ఎప్పుడూ కూడా ముద్దు సన్నివేశాలు లేకుండా చూసుకుంటూ ఉంటుందట. అలాంటి సన్నివేశాలు ఎప్పుడు చేయలేదని తెలియజేస్తోంది. అయితే ఇప్పుడు ఈమె కూతురు రాషా థడానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. తన కూతురు ముద్దు సన్నివేశాలు చేయాలనుకుంటే ఆమె పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు రవీనా టాండకు ఎదురయ్యింది.. దీంతో ఈమె మాట్లాడుతూ .. అమే మిద అది ఆధారపడి ఉంటుంది ఆమె ఎవరితోనైనా సరే సౌకర్యంగా అనిపిస్తే చేయడం మంచిది.. లేకపోతే ఆ పని చేయకూడదని తెలియజేసింది.. అయితే ఈ విషయం పైన ఎవరి బలవంతం ఉండకూడదని తెలిపింది రవీనా టాండన్.
ఇక గతంలో తనకు జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ గతంలో ఒక నటుడు తో కొంచెం కఠినంగా హ్యాండ్లింగ్ సన్నివేశాలు చేశానని పొరపాటున అతని పెదాలు తన పెదాలకు తగిలినట్లు గుర్తుచేసుకుంది.. అది పొరపాటు జరిగిన నాకు అంత సౌకర్యంగా లేకపోవడంతో నా గదిలోకి వెళ్ళిపోయాను.. నాకు వికారం వచ్చింది.. నేను భరించలేకపోయాను.. నేను అయ్యో కాదు.. దయచేసి పళ్ళు తోముకోండి నోరు వందసార్లు కడుక్కోండి అంటూ తెలియజేసింది.. అయితే ఆ నటుడు క్షమాపణలు కూడా చెప్పాడని తెలిపింది.