శ్రీకాంత్- ఊహ పెళ్లి వెనుక ఇంత కథ ఉందా..!!

టాలీవుడ్ హీరోలలో శ్రీకాంత్ కూడా ఒకరు. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయిన శ్రీకాంత్ పలు సినిమాలలో సెకండ్ హీరోగా కూడా నటించారు. మొదట విలన్ గా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారారు. తన సహనటి అయిన ఊహను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు శ్రీకాంత్. అయితే వీరిద్దరి పెళ్లి అంతా సజావుగా సాగలేదట వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Srikanth Meka rubbishes rumours about his troubled marriage with Ooha |  Telugu News - The Indian Express

శ్రీకాంత్ ఊహకి ముగ్గురు పిల్లలు కలరు..ఇందులో పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తన చిన్న కుమారుడిని కూడా త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీకాంత్ తన పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేయడం జరిగింది. సినిమాలలో నటిస్తున్న సమయంలోనే శ్రీకాంత్, ఊహకు పెళ్లి ప్రపోజల్ చేశారని ఆ తర్వాత ఊహ ఒప్పుకోవడం జరిగిందని.. కానీ కుటుంబ సభ్యులు మాత్రం శ్రీకాంత్ కు తెలియకుండానే పెళ్లి సంబంధాలు చూసేవారట.

ముఖ్యంగా శ్రీకాంత్ స్వస్థలం కర్ణాటక ప్రాంతంలో జన్మించారు. శ్రీకాంత్ తండ్రి వ్యవసాయం చేసుకొని వ్యక్తి కావడంతో మొదటిసారి ఊహను ప్రేమిస్తున్నానని విషయం చెప్పగానే ముందు కోప్పడ్డారట.. దీంతో ఆమెతో పెళ్లికి ఒప్పుకోలేదట.. శ్రీకాంత్ నెమ్మదిగా తన ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీలకు ఆమెను తీసుకువెళ్లడం వంటివి జరుగుతూ ఉండేవట.. అలా నెమ్మదిగా అందరితో పరిచయాలు ఏర్పడిన తర్వాత తమ పెద్దలతో ప్రేమను తెలియజేసి వారి అంగీకారంతో వివాహం చేసుకున్నారట. అయితే మొదట శ్రీకాంత్, ఊహ కుటుంబ సభ్యులు ఇద్దరు వీరి ప్రేమను తిరస్కరించారట. ఎన్ని సంబంధాలు వచ్చిన ఇద్దరు రిజెక్ట్ చేస్తూ ఉండడంతో.. చివరికి చేసేదేమీ లేక తల్లిదండ్రులు విరి వివాహం చేసినట్లు తెలుస్తోంది.