విజయ్ ట్వీట్ పై.. రష్మిక అదిరిపోయే రిప్లై..!!

టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వీరు మాత్రం కేవలం తామిద్దరం స్నేహితులమే అంటూ తెలియజేశారు. తాజాగా రష్మిక, విజయ్ దేవరకొండ ఉద్దేశిస్తూ నువ్వు ఎప్పటికీ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.

Rashmika Mandanna, Vijay Devarakonda Spotted Together On 'Funday'

రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం యానిమల్.. ఈ సినిమాని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. నిన్నటి రోజున ఈ సినిమాకు సంబంధించి టీజర్ ని సైతం విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం.. టీజర్ ని ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ ఒక ట్విట్ చేయడం జరిగింది.. యానిమల్ టీజర్ తనకి చాలా నచ్చిందని మై డార్లింగ్స్ సందీప్ రెడ్డి వంగ రష్మిక అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణబీర్ కపూర్ కు ఆల్ ది బెస్ట్ అంటూ హ్యాపీ బర్తడే అంటూ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.

ఈ ట్విట్ పైన తాజాగా రష్మిక స్పందించడం జరిగింది.. థాంక్యూ విజయ్ దేవరకొండ నువ్వు ఎప్పటికీ ది బెస్ట్ అంటే రిప్లై ఇచ్చింది..దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియల్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.