“స్కంధ” సినిమాను మిస్ చేసుకుని.. ఇప్పుడు ఏడుస్తున్న హీరోయిన్ .. శని నెత్తి మీద ఉంటే అంతేగా మరి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్సిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్ పోతినేని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా స్కంద. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . బొమ్మ మొదటి షో తోనే సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరి ముఖ్యంగా బీభత్సమైన మాస్ లుక్ లో రామ్ పోతినేని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి..

కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది శ్రీ లీల. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా బోయపాటి శ్రీను రష్మిక మందన్నాను అనుకున్నారట . కానీ అమ్మడు ఈ పాత్ర 2 మాస్ గా ఉండడం అంతేకాకుండా రామ్ హీరోగా ఉండడంతో ఎక్కడ సినిమా ఫ్లాప్ అవుతుందో అన్న భయంతో రిజెక్ట్ చేసిందట. అయితే అమ్మడు దురదృష్టమో ఏమో కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

అప్పటివరకు అసలు సినిమా హిట్ అవుతుంది అనుకోని జనాలు కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రష్మిక మందన్నా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అంటూ బాధపడిపోతుందట. దీంతో ఆమె నిర్ణయం మరోసారి ఫ్లాప్ అయ్యింది..!!