“ఇంకోసారి అలా చేస్తే మర్యాదగా ఉండదు”.. కొవై సరళకు ఇంటికెళ్లి వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా..?

ఒకప్పటి కామెడీ టైం కి ఇప్పటి టైమింగ్ కి ఎంత తేడా ఉందో మనం బాగా గమనించవచ్చు . ఒకప్పుడు కామెడీ అంటే ఫ్యామిలీ అంతా కలిసి పిల్లలతో సహా చూసి నవ్వుకునే వాళ్ళం.. ఇప్పుడు కామెడీ అంటే పచ్చి బూతులు వల్గర్ మీనింగ్స్ నాలుగు గోడల మధ్య జరిగే విషయాన్నీ పబ్లిక్ గా చెప్పేయడమే కామెడీగా అనుకుంటున్నారు కమెడియన్స్ . అయితే ఒకప్పటి కమెడియన్స్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న జంట కోవై సరళ – బ్రహ్మానందం .

క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా ఇప్పటికీ మనం టీవీలో చూసి నవ్వుకుంటున్నం అంటే దానికి కారణం వీళ్లిద్దరనే కారణం అని చెప్పాలి. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు . ప్రతి సినిమాలో వీళ్ళ కాంబో వీళ్ళ కామెడి టైం అదిరిపోయే రేంజ్ లో ఉండేది. అయితే వీళ్ళిద్దరి మధ్య చనువు చూసిన కొందరు కావాలనే వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ పుకార్లు పుట్టించారు .

దాని కారణంగా బ్రహ్మానందం మ్యారీడ్ లైఫ్ లో చికాకులు వస్తున్నాయి ఏమో అని భావించిన కోవై సరళ ఆయనతో నటించడమే మానేసింది . మేకర్స్ అడిగినా సరే ఆఫర్ ని రిజెక్ట్ చేసేదట. దీంతో కోపం వచ్చిన బ్రహ్మానందం స్ట్రైట్ గా ఇంటికెళ్లి మరి వార్నింగ్ ఇచ్చారట . ఎవరో ఏదో అనుకుంటే మనకేం సంబంధం .. మనం ఇండస్ట్రీలోకి వచ్చాక జనాలను ఎంటర్టైన్ చేయాలి అదే ఇంపార్టెంట్ అంటూ ఫుల్ ఫైర్ అయిపోయారట . ఆ తర్వాత కోవైసరళ.. తప్పు తెలుసుకొని మళ్లీ బ్రహ్మానందంతో నటించడం మొదలుపెట్టింది . ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో వీళ్ళు కలిసి నటించి మెప్పించారు..!!