మాజీ మంత్రికి బాబు షాక్..సీటు లేనట్లే.!

ఈ సారి గెలిచేవారికి సీటు అని చెప్పి చంద్రబాబు..ఎంతటి సీనియర్ నేతనైన సరే సరిగ్గా పనిచేయకపోతే పక్కన పెట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లని సైడ్ చేసి..కొత్త ఇంచార్జ్ లని పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఈ సారి ఎన్నికల్లో టి‌డి‌పి గెలవకపోతే ఏం జరుగుతుందో బాబుకు తెలుసు. అందుకే ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. మొహమాటలు వదిలేసి..పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు అసెంబ్లీ సీటు విషయంలో ఈ సారి బాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుపుకు దూరమైన అరకు స్థానంలో అభ్యర్ధిని మార్చడానికి బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కిడారి సర్వేశ్వరరావుని టి‌డి‌పిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కానీ మధ్యలో ఆయన్ని నక్సలైట్లు కాల్చి చంపేశారు. దీంతో ఆయన తనయుడు శ్రావణ్‌కు బాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే అరకు ఉపఎన్నిక రాకపోవడంతో శ్రావణ్ ఎన్నికల ముందు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో శ్రావణ్ టి‌డి‌పి నుంచి బరిలో దిగి..రాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన నేతగా రికార్డు సృష్టించారు.

అరకులో వైసీపీ నుంచి చెట్టి ఫాల్గుణ గెలిచారు. సెకండ్ ప్లేస్ లో దొన్ను దొర నిలిచారు. కేవలం 20 వేల ఓట్లు తెచ్చుకుని శ్రావణ్ డిపాజిట్ కోల్పోయారు. ఈ సారి ఎన్నికల్లో శ్రావణ్‌కు సీటు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. టి‌డి‌పిలోకి వచ్చిన దొన్ను దొరకు సీటు ఇస్తారని తెలుస్తోంది. శ్రావణ్ ఇంచార్జ్ గా అరకులో టి‌డి‌పిని బలోపేతం చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆయనకు ఈ సారి సీటు దక్కే ఛాన్స్ లేదు.