ప్రముఖ ఓటీటి ఛానల్లో జైలర్ మూవీ స్ట్రిమింగ్ డేట్ లాక్..!!

రజనీకాంత్ తాజాగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాతో మరొకసారి తన స్టామినా ఏంటో చూపించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలైన జైలర్ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి రజనీకాంత్ తన స్టామినా ఏంటో చూపించారు.

 

దాదాపుగా ఏడు సంవత్సరాల తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ ని సెట్ చేశారు. తెలుగు సినిమాకు సంబంధించి ఓటిటి రిలీజ్ డేట్ అధికారికంగా ఒక ప్రకటన వెలువడింది. అభిమానులు జైలర్ సినిమా ఓటీటి తేది కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. సెప్టెంబర్ 7వ తేదీన తమ ఓటీటి లో స్ట్రిమింగ్ కాబోతోందని అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది.. తెలుగు హిందీ కన్నడ మలయాళం తమిళ్ వంటి భాషలలో అదే రోజే స్త్రమ్మింగ్ కాబోతున్నట్లు తెలియజేసింది.

తమ అభిమాన నటుడి సినిమాను చూడొచ్చని సంతోషం వ్యక్తం చేస్తున్న రజనీకాంత్ ఫ్యాన్స్ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా చేస్తున్నారు. నిన్నటి రోజున రజనీకాంత్ కు అదనంగా రూ .100 కోట్ల రూపాయల చెక్ అందించినట్లుగా నిర్మాత వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగులో 30 కోట్లకు పైగా లాభాలు అందించిన జైలర్ సినిమా ఓటీటి లో ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి. ఇందులో రమ్యకృష్ణ ,సునీల్ ,యోగి బాబు, శివరాజ్ కుమార్, మోహన్లాల్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు.