జైల్లో బాబు పాలిటిక్స్..భారీ ప్లాన్?

రాజకీయ నాయకుడు ఎక్కడున్న రాజకీయమే చేస్తారన్నట్లుగా.40 ఏళ్ళు పైనే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు..నిద్రలో కూడా రాజకీయం చేయగలరు. అందుకే ఇప్పుడు స్కిల్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన అక్కడ నుంచే రాజకీయం నడిపిస్తున్నారు. జైలు నుంచే జగన్‌ని ఎదుర్కునేలా స్కెచ్‌లు వేస్తున్నారు. ఇక బాబు రాజకీయానికి పవన్ తోడు అవుతున్నారు. ఇటూ లోకేశ్, బాలయ్య..పవన్‌ని కలుపుకుని బాబు పాలిటిక్స్ నడిపిస్తున్నారు. అందుకే బాబుని ముగ్గురు జైల్లో కలవనున్నారు.

ఇదే సమయంలో బాబు ఈ కేసులో బెయిల్ కోసం మాత్రం ముందుకెళ్లడం లేదు. అసలు ఈ కేసు సరికాదని, దాన్ని కొట్టివేయించుకుని జగన్ కక్షపూరితంగానే ఇదంతా చేశారని నిరూపించాలని చూస్తున్నారు. అందుకే తాజాగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేవలం స్కిల్ కేసులో బాబు అరెస్ట్ అయ్యారు..రిమాండ్ అయ్యారు..అంతే గాని ఈ కేసు రుజువై శిక్ష పడలేదు. అసలు ఈ కేసులో ఆధారాలు లేవని వాదిస్తున్నారు.

అసలు చంద్రబాబు వ్యూహాత్మకంగానే జైల్లో ఉంటున్నారన్న  వాదన రాజకీయాల్లో వినిపిస్తోంది.  చంద్రబాబు కుంగిపోవడం అనేది ఉండదని.. రాజకీయ వేధింపులను కూడా రాజకీయ వ్యూహాలతో ఎదుర్కొంటారని అంటున్నారు. అందుకే జైలు నుంచే అసలు కథ నడిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇక పిల్లలకు మంచి భవిష్యత్ ఇచ్చేలా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇప్పిస్తే  అరెస్ట్ చేశారని చెబుతూ.. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గాల కేంద్రంగా బాబుతో మేము అనే ఓఎమోషన్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.  మొత్తానికి జైలు నుంచే బాబు పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు.