పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్ట్‌ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్ త్రో బ్యాక్ థీంతో వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫోటోలో బ్లాక్ కలర్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్న ఆ బుజ్జి పాప ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. పెద్ద పెద్ద కళ్ళతో తన అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈమె ఇప్పటివరకు నటించిన ఏ సినిమాలు ఫ్లాప్ కాలేదు.

ఇక అప్పట్లో ఈమెకు గోల్డెన్ హీరోయిన్ అనే పేరు వచ్చినా ఊహించిన రేంజ్ లో అవకాశాలు అయితే రావడం లేదు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే ఒక సినిమాలో నటిస్తుంది. ఈమె ఓ మళ‌యాళ‌ బ్యూటీ.. ఎవరు ఇప్ప‌టికైనా గుర్తుపట్టారా.. ఈమె ఎవరో కాదు సంయుక్తా మీనన్. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో రానా జంటగా నటించిన ఈ బ్యూటీ తరువాత మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తో విరూపాక్ష సినిమాలో నటించి. ఈ సినిమాతో భారీ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. తర్వాత ధనుష్ తో సార్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గోల్డెన్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది.

ఇక ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న డెవిల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మూవీ టీమ్‌. ఇక ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమాకు కూడా సంయుక్తని హీరోయిన్గా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు నిఖిల్ ఎంతగానో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సంయుక్త మీనన్ రోల్‌పై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు.