ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పై అదిరిపోయే అప్డేట్.. ఓ పీరియాడికల్ మూవీ లో.. డైరెక్టర్ ఎవరంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌తో కొనసాగుతున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు. అయితే రాజమౌళితో సినిమా చేసిన హీరోలకు ఆ వెరీ నెక్స్ట్ మూవీ అంటే గండమే అన్న సెంటిమెంట్ ఇప్పటినుంచో కొన‌సాగుతుంది కూడా.

తారక్ దేవ‌ర సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని కసితో పని చేస్తున్నాడట. దర్శకుడు కొరటాల శివ కూడా దేవర‌తో ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆయన తర్వాత సినిమా విషయంలో కూడా ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. దేవర తర్వాత తారక్ ప్రశాంత్ నీతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ కేవలం రెండే రెండు సినిమాలు దర్శకత్వం వహించిన యువ దర్శకుడికి అవకాశం ఇచ్చాడ‌ట‌.

అతను ఎవరో కాదు రాహుల్ సమఖృత్య‌న్‌. టాక్సీవాలా, శ్యామ్ సింగ‌రాయ్‌ సినిమాలతో దర్శకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. ఎన్టీఆర్ కోసం ఓ మంచి పిరియాడికల్ కథను రెడీ చేసినట్లు.. ఆ క‌థ‌ని ఎన్టీఆర్‌కి వినిపించగా కథ నచ్చడంతో దేవర మూవీ తర్వాత వెంటనే ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు టాక్.