కోటంరెడ్డికి అదిరే షాక్..మూడోసారి గెలవకుండా?

ఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ ఉన్న నాయకుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు. కాకపోతే ఈయన వైసీపీలో ఉన్నప్పుడు సొంత ఇమేజ్ పెంచుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచి గెలిచారు. ఇలా రెండుసార్లు గెలవడానికి పలు కారణాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ లో రెడ్డి వర్గం హవా ఉంది..వైసీపీకి పట్టున్న సీటు అందుకే కోటంరెడ్డి గెలవగలిగారు. అలా గెలిచిన ఆయన కాస్త ప్రజల్లో సొంతంగా ఇమేజ్ కూడా పెంచుకున్నారు.

అయితే పార్టీలో కొన్ని విభేదాలతో కోటంరెడ్డి వైసీపీకి దూరమయ్యారు. అనూహ్యంగా వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో ఆయన టి‌డి‌పి వైపుకు వచ్చారు. టి‌డి‌పిలో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన టి‌డి‌పి నుంచి పోటీకి దిగుతున్నారు. మరి టి‌డి‌పి నుంచి పోటీ చేస్తే కోటంరెడ్డి గెలవగలరా? అంటే చెప్పలేని పరిస్తితి. రూరల్ లో టి‌డి‌పికి పట్టు తక్కువే. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత, కోటంరెడ్డి ఇమేజ్ తో కాస్త గెలుపు అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో వైసీపీ నుంచి బలమైన నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నిలబడుతున్నారు. వైసీపీకి రెడ్డి ఓటు బ్యాంక్, ఆదాల ఆర్ధిక బలం, వైసీపీ కేడర్ సపోర్ట్ ఎక్కువ. దీంతో ఇక్కడ వైసీపీకే ఆధిక్యం కనిపిస్తుంది. కానీ వైసీపీకి ఎలాగైనా చెక్ పెట్టాలని కోటంరెడ్డి పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలోని కొందరు బలమైన నేతలని తనతో పాటు టి‌డి‌పిలోకి తీసుకొచ్చారు.

ఈ క్రమంలోనే నెల్లూరు మేయర్ స్రవంతి సైతం టి‌డి‌పి లోకి వచ్చారు. కానీ ఇప్పుడు రివర్స్ లో అనూహ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వైసీపీ వైపుకు వెళ్లిపోయారు. దీంతో కోటంరెడ్డికి షాక్ తగిలినట్లు అయింది. మొత్తానికి రూరల్ లో కోటంరెడ్డి బలం నిదానంగా తగ్గుతున్నట్లే ఉంది. దీంతో ఆయనకు మూడోసారి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.