శ్రీ లీల జాతకం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..మరీ ఇంతలా..?

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పెళ్లి సందD అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైనా శ్రీ లీల గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. కథల ఎంపిక విషయంలో తన టాలెంట్ ని చూపించి మరొకసారి తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఎక్కువగా సీనియర్ హీరోల సినిమాలలో నటించి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు యంగ్ హీరోలకి కూడా అవకాశం ఇస్తూ ఏకంగా 10 సినిమాలను లైన్లో పెట్టి భారీ పారితోషకంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.

Venu Swamy Predicts SreeLeela Future | cinejosh.com

ఇదిలా ఉండగా వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రీ లీల జాతకం పై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ విధంగా స్పందించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురవుతోందని చెప్పవచ్చు. ఇక శ్రీ లీల జాతకం పై వేణు స్వామి ఏవిధంగా స్పందించారు అనే విషయానికి వస్తే.. శ్రీ లీలది మీన రాశి. ఇక ఆమె జాతకంలో ఉండే రవి, గురు, శుక్ర , శని గ్రహాల ఆధారంగా ఆయన జాతకాన్ని విశ్లేషించారు. శుక్రుడు చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాడని.. రవి, గురు , శని పదో స్థానంలో ఉన్నారని..ఈ కారణంగానే ఆమెకు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయని వెల్లడించారు.

 

అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయని.. డబ్బు కూడా ఎక్కువగా సంపాదిస్తుందని జాతకరీత్యా అన్నీ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. 2023 జూన్ నుంచి 2028 చివరి వరకు శ్రీ లీల కి అనుకూలమైన ఫలితాలే వస్తాయని.. టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలోనూ రెండు మూడు భాషల్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సమంత , నయనతార, కాజల్, అనుష్క వంటి వారి జాతకం లాగే శ్రీ లీల జాతకం కూడా చాలా గొప్పగా ఉంది అని.. ఆమె చాలా సంవత్సరాలు ఇండస్ట్రీలో కొనసాగుతుంది అని ఆయన వెల్లడించారు. మొత్తానికి అయితే శ్రీ లీల జాతకంపై వేణు స్వామి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.