ఆలియా అవకాశాలన్నీ లాగేసుకుంటున్న జాన్వి కపూర్..!

శ్రీదేవి దారిలోనే ఆమె కూతురు జాన్వి కపూర్ కూడా ఇంటగెలిచి బ‌య‌ట‌ గెలిచే ప్ర‌య‌త్నంలో ఉంది. కాకపోతే వీరిద్ద‌రు కాస్త రివ‌క్స్‌. శ్రీదేవి దక్షిణాది అమ్మాయి కావ‌టంతో ఇక్క‌డ నుంచి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ముందు దక్షిణాది హీరోయిన్గా స్టార్‌డంని సంపాదించుకున్న శ్రీదేవి తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ గా జెండా పాతుకుంది.

ఇప్పుడు జాన్వి కపూర్ ఇల్లు ఉత్తరాది కాబట్టి అక్కడ దడక్, సక్‌సేన్ సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా నిలతక్కుని.. రచ్చ గెలవడానికి టాలీవుడ్ పై కన్నేసింది. ఆమె ఎన్టీఆర్‌తో ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉండగానే జాన్బీకి మరిన్ని తెలుగు సినిమాల ఆఫర్స్ వెలువెత్తుతున్నాయని సమాచారం. ఆమె సినిమాల విషయంలో ఫైనల్ నిర్ణయం మాత్రం తండ్రి బోనికపూర్‌దేన‌ట‌.

నిజానికి ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఆలియా భట్ తెలుగులో రాణిస్తుందని అందరూ భావించారు. అనుకున్న విధంగానే ఆలియా భట్ కు అప్పట్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత అవకాశాలన్నీ జాన్వి తీసుకుపోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. చూస్తూ ఉంటే టాలీవుడ్‌లో తన తల్లి శ్రీదేవి ఫాలోయింగ్ జాన్వి కంటిన్యూ చేసేలా ఉందంటూ సినీ ప్రముఖుల అభిప్రాయం.