సైడ్ అవుతున్న తమ్ముళ్ళు..టీడీపీకి డ్యామేజ్.!

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనలు తెలియజేసే విషయంలో గాని, వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో గాని తెలుగు తమ్ముళ్ళు బలంగా ఉన్నారా? అంటే ఏ మాత్రం లేరనే చెప్పాలి. ఏదో బాబు అరెస్ట్ అయిన రోజు కాస్త హడావిడి చేశారు. తర్వాత రోజు బంద్ అన్నారు గాని..పూర్తి స్థాయిలో తమ్ముళ్ళు బయటకురాలేదు. ఏదో అక్కడకక్కడ కార్యకర్తలు మాత్రం పోరాడుతున్నారు.

అసలు టి‌డి‌పి అధికారంలో ఉండగా హడావిడి చేసిన నేతలు..ఇప్పుడు బాబు కోసం అండగా నిలబడుతున్నట్లు కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగానే పోరాటాలు చేస్తున్నారు. అసలు వీరి కంటే పవన్ బెటర్ అని కింది స్థాయి కార్యకర్తలు భావిస్తున్నారు. పవన్..బాబుకు అండగా నిలబడ్డారని చెబుతున్నారు. కానీ టి‌డి‌పి నేతలు మాత్రం అలా చేయడం లేదని మాట్లాడుకుంటున్నారు. ఆఖరికి పక్కనే తెలంగాణలో సైతం టి‌డి‌పిని అభిమానించే వారు బాబు కోసం పోరాడుతున్నారని, తాజాగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో బాబు కోసం రోడ్డు ఎక్కారని, ఆ స్థాయిలో ఏపీలో తమ్ముళ్ళు రోడ్డు ఎక్కడం లేదని అంటున్నారు.

 

అయితే ఇలా బాబు అరెస్ట్ అవ్వడం తమ్ముళ్ళు ఏదో మొక్కుబడిగా ఉండటంతో..పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇలా తమ్ముళ్ళు వెనుకడుగు వేయడానికి కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. మొదట బయటకొస్తే జగన్ కేసులు పెట్టి జైల్లో పెడతారనే భయం. పైగా గతంలో అధికారంలో ఉంటూ ఆస్తులు సంపాదించుకున్నవారు, బిజినెస్ ఉన్నవారు బయటకు రావడానికి భయపడుతున్నారు.

ఇక ఇప్పుడే డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తలని తీసుకొచ్చి హడావిడి చేయడం వాళ్ళ ఎన్నికల సమయంలో ఇబ్బంది పడతామనే టెన్షన్. ఇలా రకరకాల కారణాలతో తమ్ముళ్ళు బాబు కోసం పోరాటం చేసే విషయంలో వెనుకబడ్డారు.