పవర్ స్టార్ ఈజ్‌ బ్యాక్.. ఉస్తాద్ భ‌గ‌త్‌ సింగ్ కొత్త స్కేడ్యుల్‌ స్టార్ట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. రాజకీయ కారణాలతో ఈ సినిమా ఎప్పటినుంచో బ్రేక్ పడుతూ వచ్చింది. అయితే ఇటీవల కొంత కాలం బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ మూవీ సెట్ లోకి వచ్చిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరిష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి కొన్ని కీలక అప్డేట్స్ వచ్చాయి.

సెట్స్ వ‌ద్ద‌కి వ‌చ్చిన పవన్ కు సీన్ వివరిస్తున్న హరీష్ శంకర్ ఫోటోతో పాటు.. పవన్ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలనే మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం నాన్‌స్టాప్ షెడ్యూల్ జరుగుతుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను నవీన్ యార్నేని, రవిశంకర్ కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, కేజిఎఫ్ ఫేమ్ అవినాష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో స‌డ‌న్‌గా అక్కడికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు పాటు షూటింగ్ దూరంగా ఉంటాడేమో అన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు తిరిగి షూటింగ్లో పాల్గొనడంతో షూటింగ్ ప్రారంభించిన మూవీ టీం పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం.. గబ్బర్ సింగ్ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్ హరిష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి.