కోడిగుడ్డును ఎక్కువగా తింటున్నారా.. అయితే ప్రమాదమే..?

కోడిగుడ్డులో ఎన్నో పోషకాహారాలు ఉంటాయని ప్రతిరోజు వైద్యులు ఒక గుడ్డును తినమని సూచిస్తూ ఉంటారు.. శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు గుడ్లు తినడం వల్ల కూడా లభిస్తాయి అని చెప్పవచ్చు. దీనిలో ఎన్నో రకాలైన విటమిన్స్ ఉండడంతో ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అయితే కోడిగుడ్డులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్న కొంతమందికి అనారోగ్య సమస్యలను తీసుకువచ్చేలా చేస్తాయట. ఆరోగ్యానికి మంచిదని కోడిగుడ్లను ఎక్కువగా తింటే అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్లే అంటూ నిపుణులు తెలుపుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

Prostate cancer: Eating just 3 eggs a week 'significantly increases risk' |  Daily Mail Online

కోడిగుడ్డులో అధికంగా కొలెస్ట్రాల్ ఉండడం జరుగుతుంది అందుచేతనే మధుమేహం , ప్రోస్టేట్, పెద్ద పేగు వాపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా అధికంగా ఉంటుందట.. ఈ కారణంగా గుండె సమస్యలు ఉన్నవారు కోడిగుడ్డును తినకపోవడమే మంచిదట.. ఇలా తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయట. అధిక బరువు ఉండి సన్నబడాలని ప్రయత్నిస్తున్న వారు కూడా కోడిగుడ్డుకి చాలా దూరంగా ఉండడమే మంచిదట..ఒకవేళ వీటిని తినాలనుకుంటే కోడిగుడ్డులోని వైట్ మాత్రమే తినడం మంచిది.

కోడిగుడ్డులో ఎల్లో కలర్ లో ఉండే వాటిని తినడం వల్ల కొవ్వు ఎక్కువగా పెరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు.. కూడా కోడిగుడ్లను తినకపోవడం మంచిది..తింటే కడుపునొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాలను ఉంటే రక్త ప్రసరణ సమస్యలు పెరుగుతాయి ఇలాంటి వారు కోడిగుడ్లు తినకపోవడం మరింత మంచిది. అయితే కోడిగుడ్డులోని వైట్ మాత్రమె తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు.. కానీ లోపల ఎల్లో సోనని తింటే చాలా ప్రమాదం ఉంటుందని నిపుణులు సైతం తెలుపుతున్నారు. దీన్నిబట్టి చేస్తే కోడిగుడ్డున తక్కువ మోతాదులో తినడమే చాలా మంచిదని చెప్పవచ్చు.