పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న హీరో నితిన్.. ఆ పార్టీ నుంచే..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఆడియన్స్ ను అలరిస్తున్న నితిన్.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలియజేస్తూ ఉంటారు. త్వరలోనే నితిన్ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఎన్నికలలో గెలిచేందుకు చాలా కొత్త వ్యూహరచనలు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

Nithiin Net Worth 2023: Movies List Wife Father Age Height

ఇలాంటి సమయంలోనే సినీ గ్లామర్ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. యువ హీరో నితిన్ ప్రచారంలోకి దింపే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నితిన్ మేనమామ నగేష్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు టికెట్ వస్తే కచ్చితంగా నితిన్ ద్వారా ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై హై కమాండ్ టీ కాంగ్రెస్ తో కూడా కొన్ని రకాల చర్చలు కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Shalini Reddy (Actor Nithin's Wife) Wiki, Age, Height, Figure, Family,  Engagement/Wedding Pics, Profession, Biography - Celebsunfolded

నగేష్ రెడ్డి ప్రస్తుతం టీబీసీసీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా పదేళ్లపాటు ఉన్న ఈయన.. చాలా మంచి పేరు సంపాదించారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో మోపాల్ మండలానికి చెందిన వారు నితిన్.. నితిన్ సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఎక్స్ట్రార్డినరీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది ఈ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి నితిన్ పొలిటికల్ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.