సినిమాల్లోకి రాకముందు ఈ హీరోయిన్లు ఏం చేసేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సాధారణంగా సినీ ఇండస్ట్రీ లోని హీరో హీరోయిన్ల కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలామంది నటినటులు ఇండస్ట్రీ లోకి ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటుంటారు. అయితే యాష్, విజయ్ దేవరకొండ, సమంత, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో హీరోయిన్లు ఇండస్ట్రీ కి రాకముందు ఏం చేసేవారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవల్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా జవాన్ సినిమా తెలుగు, హిందీ,తమిళం భాషలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అయితే సినిమా లోకి రాకముందు విజయ్ సేతుపతి దుబాయ్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారట. ఆయనకు 10 లక్షల వరకూ అప్పులు ఉండడంతో అవి తీర్చడానికి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో గా ఏదిగాడు.

కన్నడ నటుడు యాష్ ‘ కేజీఫ్ ‘ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కేజీఫ్ 2 సినిమా తరువాత ఆయన కోత ప్రాజెక్ట్స్ గురించి ప్రకటించలేదు. అయితే యాష్ కొత్త సినిమా కోసం అతని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యాష్ తండ్రి ఒక బస్సు డ్రైవర్. మొదట యాష్ బుల్లితెర పై అడుగుపెట్టి ఆ తరువాత వెండితేరవైపు అడుగులు వేసాడు.

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్ తన గ్రాడ్యుయేషన్ ని పూర్తిచేసుకొని మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టింది. ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు పలు యాడ్స్ లో నటించింది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ‘ అర్జున్ రెడ్డి ‘ సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. ఆ తరువాత వరుస సినిమా లో నటించి అభిమానులను అల్లరిస్తున్నాడు. హీరోగా ఇండస్ట్రీ కి రాకముందు మ్యూజిక్ వీడియోస్ చేసేవాడు విజయ్. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.