కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ ప్రాసెస్‌తో క్షణంలో ఉపశమనం కలుగుతుంది..!!

కడుపు ఉబ్బరం అత్యంత సర్వ‌సాధారణంగా వేధించే జీవన సమస్యల్లో ఇది కూడా ఒకటి. గ్యాస్ పట్టేసినప్పుడు కడుపు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఆయాసం తన్నేస్తుంది. కూర్చోలేరు నుంచో లేరు. అయితే ఇలాంటి సమస్య నుంచి క్షణంలో బయటపడవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో అంగుళం దాల్చిన చెక్క, వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకుని రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు ఒక కప్పు ఫ్రెష్ గులాబి రేఖలు వేసి వాటర్ సగం అయ్యేంతవరకు హీట్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగిన గులాబీ నీటిని ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి.

ఇలా తాగడం వల్ల క్షణంలో కడుపు ఉబ్బరం నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడే కాదు ప్రతిరోజు వాటర్ ను నిత్యం ఓ కప్పు తాగడం వల్ల ఫిట్గా ఉంటారు. అలాగే ఎప్పుడు గ్యాస్, ఆహారం అరగకపోవడం లాంటి సమస్యలు రావు.