మూత్రం రంగును బట్టి ఆరోగ్య సమస్యలు కనుగొనవచ్చు….. ఏ రంగు ఉంటే ఏ సమస్య ఇప్పుడు తెలుసుకుందాం…!!

మనలో చాలామందిని ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తే మాత్రం పరిస్థితులు చాలా కఠినంగా ఉంటున్నాయి. మూత్రం రంగు లేత పసుపు రంగులో ఉంటే మంచిది. అలా కాకుండా వేరే రంగులో ఉంటే మాత్రం వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రం రంగును బట్టి ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

మూత్రం రంగు మారడం డీహైడ్రేషన్కి సంకేతం. కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తుంటే కూడా మూత్రం రంగు మారే అవకాశాలు ఉన్నాయి. మూత్రం కు ఎలాంటి రంగు లేదంటే నీళ్లు ఎక్కువగా తాగుతున్నారని గుర్తించాలి. రక్తంలోని ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యత వల్ల కూడా ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

మూత్రం లేత పసుపు రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉంటామని అర్థం. మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మాత్రం శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు దొరకడం లేదని గుర్తించాలి. మూత్రం నారింజ రంగులో ఉంటే మాత్రం విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటే మంచిది. ఈ విధంగా చేయడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఒక వ్యక్తి తగినంత మూత్రాన్ని ఉత్పత్తి చేయలేకపోతే నారింజ లేదా గోధుమ రంగు మూత్రం వచ్చే అవకాశం ఉంటుంది.