మీ ఊపిరితిత్తులు దెబ్బతిన‌టానికి సూచనలు ఇవే…!!

వ్యక్తి శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఊపిరి తిత్తులు శరీరం అంతటికి ఆక్సిజన్ ను చేరవేస్తాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఊపిరితిత్తుల ఆరోగ్యం పై అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం జరుపుకుంటున్నారు. వ్యక్తికి ఊపిరితిత్తులు అనేవి చాలా కీలకం.

వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించిన సంకేతాలను నివారించడం వలన తీవ్ర పరిస్థితులకు దారితీస్తుంది. ఈ ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా ఎప్పటికీ చెడు జరగకుండా ఊపిరితిత్తుల వ్యాధుల సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిరంతరం దగ్గు :
నిరంతరం లేదా దీర్ఘకాలిక దగ్గు శ్వాస కోస వ్యవస్థలో లోపాలకి, అనారోగ్యానికి సంకేతంగా పేర్కొనవచ్చు. అప్పుడప్పుడు దగ్గు రావడం సాధారణమైనప్పటికీ.. చాలా వారాల పాటు ద‌గ్గు ఉంటే మాత్రం అది ఊపిరితిత్తుల సమస్యలను సూచిస్తుంది. అందుకే నిరంతరం దగ్గు వస్తున్నట్లయితే. వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

శ్వాస ఇబ్బంది :
సరిగ్గా ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం లాంటి సమస్య ఉంటే అది ఊపిరితిత్తుల అనారోగ్యానికి సందేశం. అలాగే గుండె సంబంధిత సమస్యల కారణంగా కూడా ఊపిరితిత్తుల వ్యాధుల లక్షణం కావచ్చు. ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే వైద్యుకలను కలవండి.

గురక :
ఎక్కువగా నిద్రపోయినప్పుడు చాలామందికి గురక వస్తూ ఉంటుంది. ఆడ, మగ తేడా లేకుండా గురక వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే.. గాలి సరిగ్గా అందకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. ఇది కూడా ఊపిరితిత్తుల సమస్యకి ఓ సూచన.