2వ రోజు భారీగా డ్రాప్ అయిన `స్కంద‌` క‌లెక్ష‌న్స్‌.. కార‌ణం అదేనా..?

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. శ్రీలీల, సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 28న విడుదలైన స్కంద‌కు పాజిటివ్ టాక్ లభించడంతో.. తొలిరోజు ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

అయితే రెండో రోజు మాత్రం స్కంద కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. అందుకు కారణం వర్కింగ్ డే కావడమే. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.62 కోట్ల షేర్‌, రూ. 13.50 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న స్కంద‌.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 10.57 కోట్ల షేర్‌, రూ. 17.20 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ సాధించింది. రెండో రోజు రూ. 4 కోట్ల దాకా వెళుతుంది అనుకున్నా కూడా సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయింది.

వ‌ర్కింగ్ డే కావ‌డంతో 2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.50 కోట్ల షేర్ ను ద‌క్కించుకుంటే.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 4 కోట్ల రేంజ్ లో షేర్‌, రూ. 7.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. అయితే స్కంద సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 46.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా విడుద‌ల అయింది. ఇప్పుడు ఈ టార్గెట్ ను రీచై క్లీన్ హిట్ అవ్వాలంటే.. స్కంద మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా ఇంకా రూ. 32.43 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కాగా, ఏరియాల వారీగా స్కంద 2 డేస్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 4.75 కోట్లు
సీడెడ్: 1.77 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.60 కోట్లు
తూర్పు: 86 లక్ష‌లు
పశ్చిమ: 58 లక్ష‌లు
గుంటూరు: 1.33 కోట్లు
కృష్ణ: 61 లక్ష‌లు
నెల్లూరు: 62 లక్ష‌లు
————————–
ఏపీ+తెలంగాణ‌=12.12కోట్లు(19.40కోట్లు~ గ్రాస్)
————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.20 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 1.25 కోట్లు
————————–
టోటల్ వరల్డ్ వైడ్= 14.57కోట్లు(24.30కోట్లు~ గ్రాస్)
————————–