చిన్నపిల్లలకు ఈ ఫుడ్ పెడుతున్నారా…. అయితే వారు డేంజర్ జోన్ లో ఉన్నట్లే…!!

సాధారణంగా పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఎంత దృష్టి సాదిస్తారో పెద్ద అయిన తరువాత వారి ఆరోగ్యం అంత బాగా ఉంటుంది. అందుకే ఆహారం విషయంలో వారికి ఎలాంటి ఆహారాలు ఇస్తున్నాము అన్న విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

అలా కాకుండా వారికి చిన్నప్పటి నుంచి ప్రాసెస్డ్‌ ఫుడ్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ వంటివి ఇస్తే మాత్రం చిన్న వయసులోనే షుగర్, రక్తపోటు వంటి సమస్యలకు గురవుతారు. ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ పిల్లలు తినడం వల్ల సెరటోనిన్ అని హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఇలాంటి ఆహారాలు తీసుకునే వారు మెదడు మొద్దు బారిపోవడం, ఏకాగ్రత దూరం కావడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక చిన్న పిల్లలకు స్వీట్స్ లాంటి ఆహారా పదార్థాలను కూడా పెట్టకూడదు.

స్వీట్స్, కేక్స్, ఐస్ క్రీమ్ సైతం పెట్టకూడదు. వీటిని తిన్నవారికి చిన్నవయసులోనే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలను కూడా వారు తినకపోవడం మంచిది. ఇంకా పిల్లలు కలర్ఫుల్ ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి ఫుడ్ ను ఇంటి దగ్గరే చేసుకుని పెట్టడం మంచిది. ఎక్కువగా చిన్న పిల్లలకు పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు, జీడిపప్పు, బాదం వంటివి పెడుతూ ఉండాలి. అప్పుడు పిల్లలు హెల్తీగా పుష్కలంగా ఉంటారు.