గుడ్‌న్యూస్‌.. మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్న అనుష్క-విరాట్ కోహ్లీ!?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ మ‌రోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. 2017లో వీరిద్ద‌రూ ఇటలీలో అత్యంత ఘనంగా ప్రేమ‌ వివాహం చేసుకున్నారు. దేశంలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అభిమానులు వీరిద్ద‌రినీ క‌లిసి ముద్దుగా విరుష్క అని పిలుచుకుంటారు.

ఈ దంప‌తులు 2021లో త‌మ ఫ‌స్ట్ చైల్డ్ ను ఆహ్వానించారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు అనుష్క శ‌ర్మ జ‌న్మ‌నిచ్చింది. ఆమె పేరు వామిక‌. అయితే వామిక పుట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మీడియాకు ఆమెను చూపించ‌కుండా అనుష్క‌, విరాట్ దంపతులు జాగ్ర‌త్త పాడుతూ వ‌చ్చారు. అభిమానులు ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా కూడా వారు త‌మ కూతురిని ఎవ‌రికీ చూపించ‌లేదు.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. విరుష్క జంట ఇప్పుడు త‌మ సెకండ్ చైల్డ్ కు వెల్క‌మ్ చెప్ప‌డానికి రెడీ అవుతున్నార‌ట‌. అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అయిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విష‌యాన్ని వారు అఫీషియ‌ల్ గా అనౌన్స్‌ చేయ‌బోతున్నారంటూ కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ 5న విరాట్ బ‌ర్త్‌డే. ఈ రోజు అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు.