చివరకు సీరియల్ ట్యూన్ కూడా ఎత్తేసావా అనిరుధ్‌..!

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగిపోతుంది. ఇటీవల అనురుధ్ సంగీతం అందించిన జైలర్, జవాన్ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా ప్రస్తుతం అనిరుధ్‌ విజేయ్.. ద‌ళపతి లియో, ఎన్టీఆర్.. దేవర సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు అనిరుధ్‌.

ఇక రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. ఇటీవల విజయ్ హీరోగా లోకేష్ కనగ‌రాజన్ డైరెక్షన్లో వ‌స్తున్నా లియే సినిమా లిరికల్ వీడియో ఈవెంట్ జరిగింది. ఈవెంట్ లో భాగంగా ఓ వీడియో మూవీ మేక‌ర్స్‌ రిలీజ్ చేశారు. ఆ వీడియోకి సంబంధించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ కాపీ కొట్టాడు అంటూ భారీ ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. గతంలో బుల్లితెరపై మంచి క్రేజ్ దక్కించుకున్న మొగలిరేకులు సీరియల్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కొట్టాడని ఆధారాలతో సహా చూపిస్తూ నేటిజన్స్ బీభత్సంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ఇప్పుడు వరకు థ‌మన్‌ మాత్రమే కాపీ క్యాట్ అనుకున్నాం. ఇప్పుడా జాబితాలోకి నువ్వు కూడా చేరిపోయావా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు మొగలిరేకులు సీరియల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు వెహికల్ రన్ టైం లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగానే ఉంది. దీంతో చివ‌ర‌కు సీరియల్ నుంచి కూడా మ్యూజిక్ కాపీ కొట్టాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.