ఆ వారసులకు జగన్ లైన్ క్లియర్..?

వచ్చే ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు పోటీ నుంచి తప్పుకుని తమ తనయులని బరిలోకి దింపాలని చూస్తున్న విషయం తెలిసిందే. కుదిరితే తమ వారసులతో పాటు తాము సీటు తీసుకుని పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే జగన్ మాత్రం ఇంకా వారసులకు సేతు ఫిక్స్ చేయలేదు. సీనియర్ నేతలని నెక్స్ట్ ఎన్నికల్లో కూడా తనతో పాటే పోటీ చేయాలని అంటున్నారు. దీంతో వారసుల అంశం తేలడం లేదు.

ఇప్పటికే పలువురు వారసులు సీటు రేసులో ఉన్నారు. ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు, పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, కాటసాని రామ్ భూపాల్ రెడ్డి..ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు సీనియర్ నేతల వారసులు పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో పనిచేయడం కూడా మొదలుపెట్టారు. అయితే ఏ వారసుడుకు అధికారికంగా జగన్ సీటు ఫిక్స్ చేయలేదు.

కానీ ఇద్దరు నేతల వారసులకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారసులకు లైన్ క్లియర్ అయినట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరు సీనియర్ నేతలు రాజకీయంగా నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరగడం లేదు. మొత్తం తమ వారసులే చూసుకుంటున్నారు. మచిలీపట్నంలో పేర్ని వారసుడు పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరిలో చెవిరెడ్డి వారసుడు మోహిత్ రెడ్డి..పనిచేస్తున్నారు. వీరే గడపగడపకు తిరుగుతున్నారు.

ఇక పేర్ని, చెవిరెడ్డి నెక్స్ట్ పోటీ నుంచి తప్పుకుని తమ వారసులని రంగంలోకి దింపాలని ఫిక్స్ అయిపోయారు. అందులో ఎలాంటి డౌట్ లేదని తేలిపోయింది. దాదాపు వీరిద్దరి వారసుల పోటీ చేయడం ఖాయమైందని చెప్పవచ్చు.