చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్..!!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన హర్రర్ చిత్రం చంద్రముఖి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించారు. ఇందులో జ్యోతిక నటన రజనీకాంత్ నటన అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చంద్రముఖిగా ఈమె నటన అభినయం సినిమాని మరింత హైలెట్గా చేసింది. ఇప్పటికి ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైతే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్నారు తెలుస్తోంది. అంతలా ప్రేక్షకులు చంద్రముఖి సినిమాకి కనెక్ట్ అయ్యారు. 2005లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

Kangana Ranaut to replace Jyothika in 'Chandramukhi' sequel - Bollywood  News - IndiaGlitz.com

ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ గా నటుడు రాఘవ లారెన్స్ చంద్రముఖి-2 చిత్రాన్ని తీస్తున్నారు. ఇందులో కంగానా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే చంద్రముఖి చిత్రంలో మొదటి భాగంలో జ్యోతిక పాత్రలు ముందుగా వేరే హీరోయిన్ ని అనుకున్నారట డైరెక్టర్ వాసు.. అందుకోసం ఆమెను సంప్రదించగా ఆమె ఇతర కారణాల చేత బిజీగా ఉండడంతో ఈ పాత్రను మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Some influencers stooping to any level to get likes, says Sada - The  Statesman

ఆమె ఎవరో కాదు శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు హీరోయిన్ సదా ఈ సినిమా భారీ విజయం కావడంతో డైరెక్టర్ వాసు ఆమెను చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర కోసం ఎంపిక చేయగా ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం సదా సినిమాలు తగ్గించి బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తున్నది ప్రస్తుతం పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. ఒకవేళ చంద్రముఖి సినిమాలో సదా నటించి ఉంటే ఆమె కెరియర్ మరొక లాగా ఉండేదని చెప్పవచ్చు.