శ్రీదేవి త‌ర్వాత అంత అంద‌గ‌త్తె కియారానే అట‌.. డైరెక్ట‌ర్ ట్వీట్‌పై నెటిజ‌న్లు సెటైర్లు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో కియారా అద్వానీ ఒక‌టి. త‌క్కువ స‌మ‌యంలోనే నార్త్ లో స్టార్డ‌మ్ ను ద‌క్కించుకుని.. కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. కియారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. ఈ ముద్దుగుమ్మ తెలుగులో భ‌ర‌త్ అనే నేను, విన‌య విధేయ రామ చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం తెలుగులో `గేమ్ ఛేంజ‌ర్‌` మూవీలో రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా కియారా న‌టిస్తోంది.

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వ‌చ్చే ఏడాది ఆరంభంలో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే కియారా నిన్న బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఆమెకు అభిమానులు, నెటిజ‌న్ల‌తో పాటు సినీ తార‌లు కూడా సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌జే సూర్య కూడా ఓ ట్వీట్ చేశాడు.

కియారాను శ్రీదేవితో పోలుస్తూ ఎస్‌జే సూర్య ట్వీట్ చేశాడు. `హ్యాపీ బ‌ర్త్‌డే అందాల యువ‌రాణి.. శ్రీదేవి త‌ర్వాత అంత‌టి అందం, అభిన‌యం నీ సొంతం` అంటూ ఎస్‌జే సూర్య త‌న ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో నెటిజ‌న్లు ఎస్‌జే సూర్యపై నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఇది మ‌రీ ఓవ‌ర్ గా లేదు.. కియారా చెవిలో బాగా ఫ్లెవ‌ర్స్ పెడుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఎస్‌జే సూర్య ట్వీట్ మాత్రం నెట్టింట వైర‌ల్ అవుతోంది. కాగా, కియారా-ఎస్‌జే సూర్య గేమ్ ఛేంజ‌ర్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇందులో విల‌న్ గా ఎస్‌జే సూర్య న‌టిస్తున్నాడు.