బీఆర్‌ఎస్ దూకుడు..కాంగ్రెస్ తగ్గట్లేదు.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో నడుస్తుంది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాటల యుద్ధం తారస్థాయిలో కొనసాగుతుంది. అధికార బి‌ఆర్‌ఎస్ తమ బలంతో దూకుడుగా ముందుకెళుతుంది. ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. అయితే మొన్నటివరకు కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది..కానీ ఇప్పుడు కాంగ్రెస్ సైతం..బి‌ఆర్‌ఎస్‌కు ధీటుగా రాజకీయం నడిపిస్తుంది.

ఓ వైపు చేరికలతో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. ఇదే జోష్ తో బి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తుంది. అయితే బి‌ఆర్‌ఎస్ సైతం ఎక్కడా కూడా కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇవ్వకుండా ముందుకెళ్లాలని చూస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే 5 గురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ గట్టిగానే సమాధానం ఇస్తుంది. అటు బి‌జే‌పి ముగ్గురు ఎమ్మెల్యేలు దూకుడుగానే ఉంటున్నారు. మొదట అసెంబ్లీలో వరదలపై పెద్ద రచ్చ జరిగింది.

అటు అమెరికాలో రేవంత్ ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా రచ్చ నడిచింది. ఇలా రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగాయి. అయితే అధికార బి‌ఆర్‌ఎస్ మరింత దూకుడు పెంచి..ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్ పెంచడం, బీసీ, మైనారిటీలకు సాయం, అటు రైతు రుణమాఫీ చేయడం..ఇలా ఎన్నికల ముందే కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలని ఆకర్షించే దిశగా బి‌ఆర్‌ఎస్ వెళుతుంది.

అయితే బి‌ఆర్‌ఎస్ కావాలని ఎన్నికల ముందు స్టంట్లు చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువగానే ప్రజలకు సేవ చేస్తామని చెబుతున్నారు. ఈ విధంగా రెండు పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మరి చివరికి ప్రజల్ ఎవరి పక్షాన ఉంటారో చూడాలి.