స్టార్ హీరో కోసం అమ్మను ఎదిరించి మరి.. అలాంటి పని చేసిన శ్రీదేవి..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ ఆమె మన మధ్య లేనప్పటికీ ఆమె నటించిన సినిమాల ద్వారా ఇంకా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తుంది . కాగా సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి నటించిన సినిమాలు ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయో మనకు బాగా తెలిసిన విషయమే .

ఇలాంటి క్రమంలోనే ఎంతమంది హీరోస్ తో కలిసి నటించిన శ్రీదేవి .. ఓ హీరో అంటే మాత్రం చాలా చాలా ఇష్టమట . ఆ హీరో కోసం ఏకంగా ఆరు రోజులపాటు అన్నం తినకుండా ఉపవాసం చేసింది అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ . ఎస్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

రజినీకాంత్ – శ్రీదేవి కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు . వీళ్ళ మధ్య స్నేహం బాగా స్ట్రాంగ్ అయిపోయింది . ఇలాంటి క్రమంలోనే రజినీకాంత్ ఒకానొక టైంలో హెల్త్ పాడు చేసుకున్నారట . ఆ టైంలో హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందట . అదే టైంలో ఆయన ఆరోగ్యం పై డాక్టర్ చేతులెత్తేస్తున్న పొజిషన్లో శ్రీదేవి షిరిడి సాయిబాబాకు మొక్కుకొని ఏకంగా 6 రోజులపాటు ఉపవాసం ఉండిందట. డాక్టర్లు కూడా చేయలేని పని ఆ దేవుడు చేశాడు .. శ్రీదేవి ఉపవాసం ఫలించి రజనీకాంత్ మళ్లీ మామూలు మనిషి అయ్యాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే శ్రీదేవి అమ్మగారు వద్దు వద్దు నీ ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పినా శ్రీదేవి వినలేదట, ఫ్రెండ్స్ కోసం ఎలాంతి పని అయినా చేస్తుంది శ్రీదేవి..!!