వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరో ఆరు రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, తమన్నా జంటగా నటించారు. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.
చిరంజీవి ఇందులో ట్యాక్సీ డ్రైవర్ గా నటిస్తే.. తమన్నా అడ్వకేట్ లాస్యగా కనిపించబోతోంది. అలాగే చిరంజీవి చెల్లెలు పాత్రను కీర్తి సురేష్ చేసింది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న భోళా శంకర్.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ వర్క్ ను కంప్లీట్ చేసుకుని.. యూ/ఏ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. అయితే సెన్సార్ సభ్యుల నుంచి భోళా శంకర్ కు పాజిటివ్ టాక్ వచ్చిందట. సినిమా చాలా బాగుందంటూ కొనియాడారట.
చిరంజీవి ఎనర్జిటిక్ యాక్టింగ్, తమన్నా గ్లామర్, చిరు-కీర్తి సురేష్ మధ్య సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్, సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్స్ గా నిలిచాయని తెలుస్తోంది.. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవల్ ఉంటుందట. విలన్ తలను చిరు నరకే సీన్ విజిల్స్ వేసేలా ఉందని అంటున్నారు. ఇక ఎమోషనల్ సీన్స్ లో కీర్తి సురేష్ నటనకు కన్నీళ్లు ఆగవట. మొత్తంగా 2023లో చిరంజీవికి రెండో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పారట. మరి సెన్సార్ సభ్యులను ఆకట్టుకుంటున్న భోళా శంకర్.. ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.