కర్నూలు తమ్ముళ్ళ పోరాటం..ఆ సీట్లపైనే ఆశలు.!

వైసీపీ కంచుకోట అయిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతలు పోరాడుతున్నారు. ఈ సారి అక్కడ సత్తా చాటాలని చూస్తున్నారు. దాదాపు జిల్లాలోని నేతలంతా ప్రజా క్షేత్రంలో ఉన్నారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో..ఈ సారి ఎలాగైనా వారికి చెక్ పెట్టి గెలవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీ గెల్చుకుంది. ఈ సారి సగం సీట్లు అయిన గెలవాలని తమ్ముళ్ళు కష్టపడుతున్నారు.

దాదాపు అందరూ నేతలు ప్రజల్లోనే ఉన్నారు. అలాగే అన్నీ సీట్లలో అభ్యర్ధులు కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ కర్నూలులో వైసీపీకి బలం ఎక్కువ. దాదాపు అన్నీ సీట్లలో రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువ. అటు ఎస్సీ వర్గం హవా ఉన్న సీట్లు ఉన్నాయి. దీంతో ఆ సీట్లలో వైసీపీకి బలం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితి ఉన్నా సరే కర్నూలులో మాత్రం వైసీపీకే అనుకూలత ఉంటుంది. కానీ ఈ సారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. ఇటు టి‌డి‌పి నుంచి కూడా మెజారిటీ సంఖ్యలో రెడ్డి సామాజికవర్గం నేతలు బరిలో ఉంటున్నారు.

బనగానపల్లెలో బి‌సి జనార్ధన్ రెడ్డి, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, మంత్రాలయంలో తిక్కారెడ్డి, ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, డోన్ లో సుబ్బారెడ్డి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. నందికొట్కూరు, కోడుమూరు ఎస్సీ సీట్లు, ఇక ఆదోనిలో మీనాక్షి నాయుడు, కర్నూలు సిటీలో టీజీ భరత్ పోటీ చేయనున్నారు. పత్తికొండలో కే‌ఈ శ్యామ్ పోటీ చేస్తారు. అంటే దాదాపు 9 సీట్లలో టి‌డి‌పి నుంచి రెడ్డి వర్గం నేతలు పోటీ చేస్తారు. ఇక టి‌డి‌పికి గెలుపు ఛాన్స్ పత్తికొండ, బనగానపల్లె, ఆలూరు, కర్నూలు సిటీల్లోనే ఉంది. ఆదోని, మంత్రాలయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. మొత్తానికి ఈ సారి కర్నూలులో టి‌డి‌పి 4-5 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది..అయినా సరే వైసీపీదే లీడ్.