`బేబీ` క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌.. ఈ చిన్న సినిమాకు ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే స్టార్ హీరోలైనా నోరెళ్ల‌బెట్టాల్సిందే!

బేబీ.. ఈ మూవీ సృష్టించిన సెన్సేష‌న్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. సాయి రాజేష్ నీలం ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ కుమార్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.

14 జూలై 2023న విడుద‌లైన ఈ చిత్రం.. మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ ఈ మూవీకి బాగా క‌నెక్ట్ అయ్యారు. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో అద‌ర‌గొట్టేసింది. మ‌రోవైపు ఆనంద్, విరాజ్ లు కూడా చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. దాదాపు నెల రోజుల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసింది. తాజాగా బేబీ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ చిన్న సినిమాకు ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే స్టార్ హీరోలైనా నోరెళ్ల‌బెట్టాల్సిందే.

బేబీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ జ‌స్ట్ రూ. 6 కోట్లు. అయితే ఫుల్ ర‌న్ లో ఈ మూవీ రూ. 45 కోట్ల షేర్, రూ. 90 కోట్ల రేంజ్ లో గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో రూ. 39 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. అంటే దాదాపుగా 7 రెట్లు లాభాలు అన్నమాట. నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన టాప్ 3 సినిమాల్లో బేబీ ఒక‌టిగా నిలిచింది. ఇక శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ మ‌రియు ఓటీటీ రైట్స్ కూడా మంచి రేట్ కి అమ్ముడుపోయినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.