నేహ‌శెట్టితో కార్తీకేయ రొ… న్స్‌… హీరోకు కాలిపోయినట్టుందిగా…!

యంగ్ హీరో కార్తికేయ ‘ ఆర్ ఎక్స్ 100 ‘ మూవీ తో టాలీవుడ్‌ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్న కార్తికేయ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇటీవల స‌బెదురులంక 2012 ‘ సినిమాలో హీరోగా కనిపించాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కార్తికేయ తాజాగా అతనిపై వచ్చిన ఓ తప్పుడు న్యూస్‌పై ఘాటుగా స్పందించాడు.

 

బెదిరంక 2012 మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ సమావేశంలో కార్తికేయ మాట్లాడుతూ ఆర్ఎక్స్ 100 సినిమాతో నాకు డీజే టిల్లు సినిమాతో నేహకి రొమాంటిక్ ఇమేజ్ వచ్చిందని అందుకే మా ఇద్దరికీ జోడి కుదిరిందని వివరించాడు. ఈ సినిమాలో కూడా మా ఇద్దరి మధ్య అలాంటి సీన్ ఉన్న ఇతర సినిమాలతో ఈ సినిమాకు పోలిక లేదని చెప్పుకొచ్చాడు కార్తికేయ. అయితే ఓ వెబ్సైట్ కార్తికేయ చెప్పిన మాటలను త‌ప్పుడు థంబ్‌నేల్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చినియాంశంగా మారింది.

అది చూసిన‌ కార్తికేయకు బాగా కాలింద‌నే చెప్పాలి. వెంటనే దానికి రియాక్ట్ అయిన హీరో తన ట్విట్టర్ వేదికగా ఘాటుగా కామెంట్స్ చేశాడు. ప్లీజ్ నా ఇంటర్వ్యూ సరిగ్గా చూసి దాని తర్వాత ఇటువంటి న్యూస్ పోస్ట్ చేయండి. ఇది నేను చెప్పలేదు దయచేసి మా ఇద్దరి ఇమేజ్‌ని లేదా సినిమాకు హాని కలిగించే విధంగా ఎటువంటి పోస్టులను చేయవద్దు.. థాంక్యూ అంటూ ట్విట్ చేశాడు. ప్రస్తుతం కార్తికేయ చేసిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.