ఒక‌టి రెండు కాదు ఏకంగా 6 భాష‌ల్లో రీమేక్ అయిన వెంకీ-సౌంద‌ర్య సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ సూప‌ర్ హిట్ జోడీల్లో విక్ట‌రీ వెంక‌టేష్‌, సౌంద‌ర్య జంట ఒక‌టి. అప్ప‌ట్లో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తోందంటే ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్ల‌కు ప‌రుగులు తేసేశాడు. ఈ జోడీకి స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వెంక‌టేష్‌, సౌంద‌ర్య జంట‌గా అర డ‌జ‌న్ కు పైగా చిత్రాలు చేశారు. ఈ లిస్ట్ లో ఒక‌టి రెండు త‌ప్పితే మిగిలిన సినిమాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి.

అలాగే వెండిత‌ర‌పై వెంక‌టేష్‌, సౌంద‌ర్య మ‌ధ్య కెమిస్ట్రీకి ఫిదా కాని వారు ఉండ‌రు. అంత అద్భుతంగా వీరు న‌టించారు. వ‌రుసగా సినిమాలు చేయ‌డం వ‌ల్ల ఒకానొక స‌మ‌యంలో వెంకీ, సౌంద‌ర్య మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ కూడా వార్తలు వ‌చ్చాయి. కానీ చివ‌ర‌కు అవి పుకార్లుగానే మిగిలాయి. ఇక‌పోతే ఒక సినిమా సూపర్ హిట్ అయితే వెంటనే మ‌రో భాష‌లో దాన్ని రీమేక్ చేయడం అనేది ఇండస్ట్రీలో ఎప్పుడూ జ‌రిగేది.

అయితే వెంకీ-సౌంద‌ర్య న‌టించిన ఓ సినిమా ఒక‌టి రెండు కాదు ఏకంగా 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి రికార్డు సృష్టించింది. ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు `పవిత్ర బంధం`. ముత్యాల సుబ్బయ్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి కీర‌వాణి స్వ‌రాలు అందించాడు. వెంకీ, సౌంద‌ర్య జంట‌గా న‌టిస్తే.. బాలసుబ్రహ్మణ్యం హీరో తండ్రిని పాత్ర‌ను పోషించారు. 1996లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. దాంతో ఈ సినిమాను ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్‌, తమిళ్‌భాష‌ల్లో రీమేక్ చేశారు. ఆయా భాష‌ల్లో కూడా ప‌విత్ర బంధం సెన్సేష‌న్ సృష్టించింది. అప్ప‌ట్లో ఇదొక రికార్డు అనే చెప్పుకోవాలి.