నోరు జారిన స్టార్ హీరో ఉపేంద్ర‌… కేసు నమోదు

కన్నడ నటుడు ఉపేంద్ర పై కేసు నమోదైంది. ఉపేందర్ రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమ్ము లేపాయి. దళితులను అవమానిచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదయింది. ప్రజాకీయా వార్షికోత్సవంలో భాగంగా ఉపేంద్ర శనివారం ఫేస్బుక్, ఇన్స్టా లైవ్ ఇచ్చారు. విమర్శలను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన కామెంట్ చేశారు. ఆ వార్తలు సామాజిక మద్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ క్రమంలో ఉపేంద్ర వ్యాఖ్యలు తమని ఆవేదనకు గురిచేశాయి. ఆదివారం బెంగళూరులో ఓ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఉపేంద్రపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్ బెంగుళూరు డిసిపి కృష్ణకాంత్ తెలిపారు. తన వ్యాక్యులకు తీవ్ర స్థాయిలో వెళ్లడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. లైవ్ మీడియాను సైతం తన సామాజిక మధ్యమాల నుంచి తొలగించారు.

ఫేస్బుక్, ఇన్స్టా లైవ్ లో పొరపాటున నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశాను…. నా వ్యాఖ్యల కారణంగా కొంతమంది ఇబ్బంది పడ్డారని గ్రహించిన వెంటనే లైవ్ మీడియాను తొలగించాను. ఆ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నన్ను క్షమించండి అంటూ ఉపేంద్ర చెప్పుకొచ్చాడు.