పొత్తులో ఎత్తులు..టీడీపీ మునిగేది అక్కడే.!

ఏదో అనుకుంటే..ఇంకేదో జరిగేలా ఉంది..టి‌డి‌పి పొత్తుల కోసం ముందుకెళ్లడం. ఏపీలో జగన్‌ని ఓడించి అధికారం దక్కించుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ ఎక్కడ కూడా టి‌డి‌పికి బలపడే అవకాశం దక్కడం లేదు. కొద్దో గొప్పో బలపడిన వైసీపీని దాటలేని పరిస్తితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు..పొత్తుల కోసం చూస్తున్నారు. ఇప్పటికే పవన్ తో కలిసి ముందుకెళుతున్నారు. అధికారికంగా పొత్తు ఖరారు కాలేదు..కానీ దాదాపు జనసేన-టి‌డి‌పి పొత్తు ఫిక్స్ అని చెప్పవచ్చు.

దీని వల్ల ఓట్లు చీలకుండా వైసీపీకి చెక్ పెట్టవచ్చు అనేది బాబు ప్లాన్. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు ఉంటేనే..ఏపీలో ఏ పార్టీకైనా గెలిచే అవకాశం ఉందనే పరిస్తితి. కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి మద్ధతు ఉంటే..ఎన్నికల సమయంలో రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్నీ రకాల మద్ధతు వస్తుంది. ఆ మద్ధతు కోసం బాబు పాకులాడుతున్నారు. ఎలాగైనా బి‌జే‌పికి దగ్గర కావాలని చూస్తున్నారు. ఆ దిశగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.

కానీ కేంద్రంలో బి‌జే‌పి పరోక్షంగా వైసీపీకే సపోర్ట్ ఇస్తుందా? అనే పరిస్తితి. అయితే రాష్ట్రంలో ఉండే పరిస్తితులు బట్టి బి‌జే‌పి ఏదైనా చేస్తుంది. ఒకవేళ టి‌డి‌పికి అనుకూల వాతావరణం ఉంటే ఆ పార్టీకి మద్ధతు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఏపీలో కూడా బి‌జే‌పి నాలుగైదు సీట్లు గెలవాలంటే టి‌డి‌పితో పొత్తు తప్పనిసరి. దీంతో టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అదే జరిగితే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్. బి‌జే‌పికి పూర్తిగా మైనస్ ఉంది. రాష్ట్రానికి ఏమి చేయలేదు. ఈ నేపథ్యంలో బి‌జే‌పిపై యాంటీ టి‌డి‌పిపై పడుతుంది. వైసీపీకి మైనస్. అలాగే పొత్తులో ఓట్లు బదిలీ అంత తేలిక కాదు. కాబట్టి ఇవేమీ వర్కౌట్ అయ్యేలా లేవు..ఫైనల్ గా టి‌డి‌పికి డ్యామేజ్ జరిగేలా ఉంది.